Sridevi
శ్రీదేవి భానుచందర అది ఆఫీస్ రూమ్ నేను ...శ్రీధర్ ఇద్దరమే. తన కొంటె చూపులతో నా హృదిని రాగరంజితం చేస్తూ....తన స్పర్శతో…నాఎదపై గులాబీలు పేరుస్తుంటే...నన్ను నేను మర్చిన క్షణములో....మొగలిపూవుల పరిమళం వంటి కంఠముతో తను "దేవి" అంటుంటే నా మనసు జలపాతమై ఎగిసెగిసి పడుతుంటే…. శ్రీధర్: " దేవి " దేవి: " ఊఁ " శ్రీధర్: " నీ అందం " అంటూ మెడ పై” శ్రీ” చూపుడి వేలితో గీస్తుంటే ఏదో తమకం ఆణువణువూ వ్యాపిస్తుంటే ….. దేవి : " అబ్బా ఊరించకు " అంటున్న వినిపించుకోకుండా, మేనిపై సువాసనల ముద్దుల పుష్పాలతో అలంకరిస్తూ శ్రీధర్ : హస్కి వాయిస్ తో “---------- సుగంధమై గుండెల్ని తాకుతుంటే దేహం వసంతమై …… వలపుల పరిమళం వెదజల్లుతుంది ." అంటున్న తన మాటలకు చిరునవ్వులు చిందించాను . నేను నవ్వుతుంటే, తను మత్తెక్కిన నయనాలతో” నీ చిరునవ్వుల సొగసులో గుబాళించే పారిజాతాన్ని .” అని తను అంటుంటే నా కన్నుల్లో మరింత నిషా వొలికింది . దేవి : ” నువ్వో పిచ్చొడివి” శ్రీధర్ : “కాదు నీ ప్రేమ పిచ్చొడ్ని." అంటుంటే న...