Sridevi
శ్రీదేవి
భానుచందర
అది ఆఫీస్ రూమ్ నేను
...శ్రీధర్ ఇద్దరమే. తన కొంటె చూపులతో నా హృదిని రాగరంజితం చేస్తూ....తన స్పర్శతో…నాఎదపై గులాబీలు పేరుస్తుంటే...నన్ను నేను మర్చిన క్షణములో....మొగలిపూవుల పరిమళం వంటి కంఠముతో తను "దేవి" అంటుంటే నా మనసు జలపాతమై ఎగిసెగిసి పడుతుంటే….
శ్రీధర్: "దేవి"
దేవి: "ఊఁ"
శ్రీధర్: "నీ అందం" అంటూ మెడ పై” శ్రీ” చూపుడి వేలితో గీస్తుంటే ఏదో తమకం ఆణువణువూ వ్యాపిస్తుంటే…..
దేవి : "అబ్బా ఊరించకు" అంటున్న వినిపించుకోకుండా, మేనిపై సువాసనల ముద్దుల పుష్పాలతో
అలంకరిస్తూ
శ్రీధర్: హస్కి వాయిస్ తో“----------సుగంధమై గుండెల్ని తాకుతుంటే దేహం వసంతమై……వలపుల పరిమళం వెదజల్లుతుంది." అంటున్న
తన మాటలకు చిరునవ్వులు చిందించాను.
నేను నవ్వుతుంటే, తను మత్తెక్కిన నయనాలతో” నీ చిరునవ్వుల సొగసులో గుబాళించే పారిజాతాన్ని.” అని తను అంటుంటే నా కన్నుల్లో మరింత నిషా వొలికింది.
దేవి : ” నువ్వో పిచ్చొడివి”
శ్రీధర్
: “కాదు నీ ప్రేమ పిచ్చొడ్ని." అంటుంటే నాలో కించుత్తూ గర్వం.
దేవి : "ప్రేమా......" సర్కాస్టిక్కుగా సాగదీస్తూ పగలబడి
నవ్వాను.
నన్నెలా కన్విన్స్ చేయాలో అర్థం కానీ తను, చిన్నబోయిన మోముతో " ప్రేమనే పదం నీ ఒంటికి సరిపడినట్లు లేదు.” అని అంటుంటే పులికి చిక్కిన జింకలా...నాలోని మరో మనిషికి కరువుదీర దొరికిన ఫీలింగ్. "ప్రేమనే పవిత్రమైన పదాన్ని స్వార్థమనే కోరికల ముసుగులో దాచేసి దాని పవిత్రతను చెడగొడుతున్నామంటూ" ఎదురు దాడి చేసేసరికి కంగుతిన్న” శ్రీ”, నెమ్మదిగానే, ఐన దృఢముగా "మనిద్దరిని కాదు...కాదు ప్రతిఒక్కరిని జీవితాంతం కలిపివుంచేది ప్రేమనే బంధమంటాను." అంటున్న శ్రీ మాటలకు మరింత రెచ్చిపోయాను.
దేవి : "అంబికా అగర్బత్తీ అడ్వెర్టైజమెంట్ కదూ!" అంటూ టీజింగ్ గా బదులిచ్చాను.
శ్రీధర్
: అంటే నీ ఉద్దేశం
దేవి: సదుద్దేశమే
శ్రీధర్
: అడ్వెర్టైజమెంట్ ఫీల్డ్ నిన్ను పాడుచేసింది
దేవి : ఒప్పుకోవచ్చు
కదా
శ్రీధర్
: ఏమని
దేవి : నువ్వు
చెప్పే స్టేట్మెంటు రాంగాని.
శ్రీధర్
: అంటే ప్రేమే లేదంటావా! లేక ప్రేమ నాలో లేదంటావా!
దేవి : ప్రేమ పేరుతో మోసం చేయొద్దంటాను.
శ్రీధర్
: నన్ను నమ్మవా!
దేవి
: ఎలా? అంటున్న నా మాటలకు తలపట్టుకున్న శ్రీ
ని చూస్తే, ఎదలో సానుభూతి పెల్లుబికింది.
అది కూడా
కొద్దీ క్షణాలే...వెంటనే కటువుగా నా శరీరం కావాలంటే డైరెక్ట్గా అడగొచ్చు కదా. ఇన్ని
డొంకతిరుగుడు మాటలెందుకు అంటున్న నన్ను…గొంగళి పురుగును చూసినంత అసహ్యముగా చూస్తూ
... .మౌనముగా బయటికి వెళుతుంటే నా మనసులో కొద్దిగా కలవరం. కానీ, నాలోని ఆడతనానికి
పొగరనే కారం కలిసి పదునైన చూపులతో సవాల్ విసిరాను.
అవును మరి,
ఎంతసేపుంటాడు. నన్నొదిలి...మహా ఐతే పది క్షణాలు..లేదా పది నిముషాలు. ఆ వెనువెంటనే “దేవి..దేవి”
అంటూ నా చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అనుకుంటూ నేను నా రూమ్ నుంచి బయటికి వస్తుంటే నా
కొలీగు ప్రభ ఎదురైంది.
“ఒసే రాక్షసి...ఏమన్నవే శ్రీధర్ ని, ఎప్పుడు చలాకీగా వుండే
శ్రీధర్ ని పలకరించినా...పలకకుండా డల్ గా ఏదో జ్వరం వచినవాడిలా…లంఖణం చేసిన వాడిలా మౌనముగా
వెళ్తున్నాడు. ఏం మాట్లాడవేందే” అంటూ నన్ను గట్టిగ నిలదీస్తుంటే, తట్టుకోలేని నేను
షట్ యువర్ మౌత్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. థిస్ ఈజ్ మై పర్సనల్. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అంటూ సీరియస్గా
నేను టీ కేబిన్ వైపు వెళ్ళాను. నేను అన్ని మాటాలన్నపట్టించుకోకుండా నాతోనే కలిసి తను టీ కేబిన్ వైపు వచ్చింది.
టీ కేబిన్
లో టీ ఆర్డర్ చేశాను. టీ తాగుతుంటే ప్రభ మల్లి
స్టార్ట్ చేసింది. “నువ్వు అసహనాన్ని తగ్గించుకోవాలి అప్పుడే నువ్వు బాగుపడతావు”. అని
చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది.
శ్రీ వెళ్లి ఇప్పటికి అరగంట పైనే అయింది. ఫోన్ లేదు. మెసేజెస్ లేదు.పది
నిమిషాలకోసారైనా ఫోన్ చేసే వాడు. ఆలాంటింది
ఒక్క ఫోన్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు.
ఏదో భయం
నన్ను ఆక్రమించింది. వెంటనే ఫోన్ చేశాను. నో రెస్పాండ్...క్షమించమంటూ మెసేజెస్ పెట్టాను.
రిప్లై లేదు.....ఏడుపు వచ్చింది...నాకు ఎవరు లేరు…నేను ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ తో నా మనసు మరింత ముడుచుకుపోయింది.
వెంటనే నా
రూమ్ నుండి బయటికొచ్చి ఆఫీస్ అంత వెదికాను... అందరిని శ్రీ గురించి అడిగాను. ఎవరికి
తెలవదంటూ చెప్తూంటే, కోపం మరింత పెట్రేగి పోయింది. అటుగా వస్తున్నా ప్రభని పట్టుకుని
నా లోని అసహనమంతా తన మీద చూపిస్తుంటే, తను నవ్వుతు నించుంది. నవ్వుతున్న ప్రభని
ఏం అనాలో అర్థం కాకా, నేను కిందకు వెళ్లి కార్ ఉందా లేదా అనుకుంటూ చుస్తే పార్కింగ్ ప్లేస్ లో కార్ వుంది
ప్రక్కన బైక్ లేదు ఇంటికి వెళ్లి పడుకున్నాడేమో అనుకుంటూ నా దగ్గర వున్నా కీస్ తో కార్
స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చాను.
ఇంటి గేట్
దగ్గర ఎన్ని సార్లు కార్ హార్న్ మోగించిన పనిమనిషి సరోజ వచ్చి గేట్ తీయకపోయేసరికి, నాలోని అసహనం మరింత
పెరిగింది. నాలోని కోపం ఎక్కువై గేట్ గడి తీసి గేట్ ని కాలితో తన్నాను. ఆ గేట్ ముందుకు
వెళ్ళినట్లే వెళ్లి వేగముగా వెనుకకు వచ్చి
నా కాలి కి తగిలింది. తన కోపమే తన శత్రువన్న విషయం తెలిసిన, నా దూకుడు తగ్గలేదు. గేట్
సౌండ్ కి లోపల ఉన్న సరోజ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది.
కాలి కి
తగిలిన దెబ్బ ను లెక్క చేయకుండా అలానే కుంటుకుంటూ,
“సర్ ఏమైనా ఇంటికి వచ్చారా!” అని అడుగుతుంటే “రాలేదు” అంటూ బదులిచ్చింది.
నాలోని కోపం తారాస్థాయికి చేరింది.
సరోజ మీద
గయి మంటూ లేచాను. “చెవులు దొబ్బయా! హార్న్ మోగుతుంటే వినపడలేదా! లోపల ఏం చేస్తున్నావ్?
టీవీ చూస్తూ డాన్స్ వేస్తున్నావా!” అంటూ సీరియస్ గా చెలరేగి పోతున్న నన్ను గమనించిన సరోజ మారు మాట మాట్లాడకుండా, నేను కార్
లోపల పెట్టేవరకు ఉండి, గేట్ వేసి లోపలకు వచ్చింది.
లోపల హాల్
లో అడుగుపెట్టిన నా దగ్గరకు కొబ్బరినూనె డబ్బా పట్టుకొచ్చి, దెబ్బ తగిలిన
దగ్గర కొబ్బరి నూనె రాయబోతుంటే, నేను రాయమన్నానా! అంటూ అరిచేసరికి దూరముగా జరిగింది.
అలానే వెళ్లి నా బెడ్ రూమ్ లో చైర్ పై కూర్చున్నాను. నా వెనుకాలే సరోజ కూడా
వచ్చింది.
తలంతా భారముగా
వుంది. సరోజ ను చూస్తూ , ఇంట్లో ఏమున్నాయి అని అడిగాను. అంటే అంటూ, సరోజ తికమక గా మొహం పెట్టేసరికి అదే కాఫీనా! టీ నా! అని
నేనడుగుతుంటే “మీ ఇష్టం మీకేది కావాలంటే అది అమ్మాయిగారు” అంటూ బదులిచ్చింది. సరేలే,
బార్ రూమ్ లో ఉన్న విస్కీ పట్టుకురా అంటూ చెపుతుంటే “అమ్మాయిగారు ఈ టైం లో వద్దులెండి”. అంటూ నాకు చెప్తుంటే, “నాకు తెలుసు కానీ, చెప్పింది చేయి” అంటున్న నన్ను ఏమి
అనలేని తను వెళ్లి కొద్దిగా గ్లాస్ లో పోసి,
దానితో పాటు వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి టేబుల్ పై
పెట్టింది.
శ్రీ అసలు పేరు శ్రీధర్ ముద్దుగా
శ్రీ అని పిలుస్తాను.నా అసలు పేరు శ్రీదేవి
నను దేవి అని పిలుస్తాడు. ఇద్దరం దృశ్యం అద్వర్టైజ్మెంట్ కంపెనీలో క్రియేటివ్
హెడ్స్ గా పని చేస్తున్నాం . ఇద్దరికి మొదటి నుండి పని లో పోటీ. కానీ, నాకన్నా శ్రీ
నే అన్ని విధాలా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంటాడు నాలోని లోటుపాట్లకు అప్పుడప్పుడు
మెరుగు పెడుతూ నాకు ప్రేరణ అవుతుంటాడు.
శ్రీ ని చూసిన మొదట్లోనే చాల
బాగున్నాడు అనుకున్నాను. కానీ, అంతకుమించి ఎక్కువ ఆలోచించాలంటే భయమేసేది అందువల్లే
నేను చాల తక్కువ మాట్లాడేదాన్ని. కానీ శ్రీ మాత్రం నన్ను వదల్లేదు . నేనెప్పుడూ ఒంటరిగా
కనపడ్డ నాతో మాట్లాడుతూ...జోకులేస్తూ ఉండేవాడు. అతనికున్న సాహిత్యాభిలాష మా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యా ము పెరిగేలా చేసి ...పెళ్లి అనే బంధముతో మా
ఇద్దరికి ముడి వేసింది
శ్రీ...
శ్రీ నేను అలానే ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. మూసుకున్న నా కనుల నిండా తనే....కొంటెగా
నవ్వుతు ...ఆపాదమస్తకం నన్ను చుంబిస్తూ ”ఓ కోమలి ... నా జాబిలి. ఓ నవయౌవన రాసి. ఈ వెన్నెల .. ఈ పున్నమి మనకోసమే ప్రేయసి” అంటూ పాట పాడుతున్నట్లుంది.
కళ్ళు తెరిచి
చూస్తే, తను నా కాళ్ళ దగ్గర భక్తిగా కూచుని
.. నన్నే చూస్తూ ... పరవశముతో నా వైపే చూస్తూన్నట్లు … నా పాదాలు తీసుకుని అరికాలుపై
ముద్దులు పెడుతుంటే నాలో చక్కిలిగిలి…తట్టుకోలేని నేను తన తలని వొడిలో తీసుకున్నాను.
ఆలా తలని వొడిలో తీసుకోవటంలో పట్టు తప్పి, నేను చైర్ మీద నుంచి కింద పడ్డాను. తగిలిన దెబ్బకి నాకు స్పృహ వచ్చింది. నా మైకం .. నా బ్రాంతి తలచుకుంటేనే నాకే సిగ్గేసింది....
నా సిగ్గు నాకే కొత్తగా అన్పించింది.
శ్రీధర్
మా ఆఫీస్ లో ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు.
తన చూపు కోసం ....తన మాట కోసం పడి చచ్చే
అమ్మాయిలు కొల్లలు..తనతో ఒక్క రోజు డేటింగ్ చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో మంది వెంటపడ్డ వాళ్ళందరిని
కాదని, నన్ను పెళ్లిచేసుకున్న శ్రీధర్ అంటే నాకెందుకో లోకువ. నేను ఏం అన్న భరిస్తూ...నన్నో
చంటిపిల్లలా ట్రీట్ చేస్తుంటాడు. ఎందుకో శ్రీ తో మాటి మాటికీ గొడవపడాలనిపిస్తుంది.
తను తెడ్డేము అంటే నేను ఎడ్డెమ్ అంటూ పేచీలు పడుతుంటాను.
దీనంతటికి
కారణం నేను చిన్నప్పటినుండి ఒంటరిగా పెరగటం
అయ్యుండొచ్చు. అంటే అమ్మ నాన్న అందరూ వుంది కూడా నేను ఏకాకిగా బ్రతికాను.
ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ
పరిచయం కాకముందువరకు, నా జీవితం కృష్ణ శాస్త్రి గారి కవితల “నా కుగాదులు
లేవు…నా కుషస్సులు లేవు….నేను
హేమంత కృష్ణానంత శర్వరిని... నాకు కాలమొక్కటే
కారు రూపు...నా శోకమ్మువలెనే…. నా బ్రతుకువలె”
అన్నట్లు ఉండేది.
నా జీవితం ఊహ తెల్సిన
కొత్తలో నాకు ఏది కావాలని అడిగిన నోరు మూసుకోమంటూ
బెదిరించే వారు. క్రమేణా నేను అడగటం మానేశాను. నా జీవితములో చెప్పుకోదగ్గ మధురస్మృతులు
లేవు. నాకున్న ఒకే ఒక స్నేహితుడు పుస్తకం…శ్రీని సన్నిహితుడిని చేసింది. బ్రతుకు మీద
నిస్తేజముగా....నిరాశగా వున్నా తరుణములో ఇక్కడ హైదరాబాద్ లో దృశ్యం కంపెనీ లో జాబ్
వచ్చింది. అప్పుడు పరిచయమయ్యాడు శ్రీ, నాలో నిద్రాణమైన కోరికలను ..ఆశలను తట్టిలేపాడు.
అర్థరాత్రి
బిర్యానీ తినాలన్పించినా...వర్షములో ఐస్క్రీమ్
తినాలన్పించిన....చలిలో ట్యాంక్బండ్ పై కబుర్లు చెప్పమన్న, రంగుల రాట్నముపై
గిరగిరా తిప్పమన్న ఏది చేయమంటే అది చేసేవాడు. ఒక్కటేమిటి ఎన్నెన్నో తీరని కోరికలన్నిటిని తీర్చేవాడు.
అమ్మ నాన్న లకు కూడా చెప్పకుండ శ్రీ ని పెళ్లి చేసుకున్నాను. నా గురించి తెల్సిన మొదట్లో నన్ను తిట్టినా, క్రమేణా వాళ్ళ పెద్దరికాన్ని నిలుపుకుంటూ నన్ను గౌరవించటం నేర్చుకున్నారు. ఇదంతా శ్రీ వల్లనే అంటే అతిశయోక్తి కాదేమో!
మొదట్లోతల్లితండ్రుల
మీద కోపముతో అప్పుడప్పుడు లైట్ గా వైన్ తీసుకునేదాన్ని.
క్రమేణా అది అలవాటుగా మారింది. ఇదిగో ఈ విస్కీ శ్రీ తెచ్చుకున్నదే తను ఎప్పుడన్నా ఓ
పెగ్ తీసుకుంటే, నేను వైన్ తీసుకునేదాన్ని. అదిగో ఆలా తెచ్చుకున్న బాటిల్ ఇది.
పది నిముషాలు కాస్త పది గంటలైంది. కాలం కూడా పగలు నుంచి రేయి అయింది. కానీ, శ్రీ జాడ లేదు. ...శ్రీ నుంచి ఫోన్ లేదు. ఓ ఆపదభాందవా ...అనాదరక్షకా! ఏడుకొండలవాడ!
కరుణించు ...
నన్ను కనికరించు శ్రీ లేకుండా నేను బ్రతకలేను. నన్ను మన్నించమని శ్రీ కి చెప్పు. నువ్వు తప్పితే నాకెవరున్నారు. నువ్వే నాకు దిక్కు ….నువ్వే నాకు సర్వం.
అల భగవంతుడిని
ప్రార్థిస్తూ, మల్లి శ్రీ కి ఫోన్ చేశాను. నో రెస్పాన్స్. స్విచ్ ఆఫ్.
సరోజ వచ్చి, బోంచేయండి అంటుంటే నాకు వద్దు.. నువెళ్ళి పడుకో అని చెప్పాను. ఉదయం నుండి ఏమి తిన్నట్లు లేదు. కాస్త తినండమ్మా గారు. పర్వాలేదు .నువెళ్ళి పడుకో అంటూ గట్టిగా చెప్పాను. నన్ను ఏమి అనలేని తను వెళ్లి పడుకుంది.
ఇందాక సరోజ ఇచ్చిన మందు టేబుల్ మీద అలాగే వుంది. దాన్ని చేతుల్లో తీసుకుని శ్రీ ఇది నీ కోసం అంటూ…. గ్లాస్ లో వున్నా మందు
మొత్తం తాగేసాను…. చేదుగా వున్నా…. బాగుంది. అలానే ప్రక్క రూమ్ కి వెళ్లి
విస్కీ బాటిల్ తెచ్చుకున్నాను.బాటిల్ ఎత్తుకుని కొద్దీ కొద్దిగా మొత్తం తాగేశాను
చుక్క ...చుక్క గొంతులో జారి .. లెక్కలేని, నా మిడిసిపాటుతనాన్ని
నిందిస్తూ నిలదీస్తుంటే..తట్టుకోలేని శరీరం అడ్డముగా పడిపోయింది.
ఏదో పరిచయమైనా కంఠం నన్ను తిడుతుంది. “మెంటల్ దాన! ఏమైందే నీకు! చంబాషి మొహం దాన! ఏమొచ్చిందే! నీళ్లు లేని బావిలో దూకి చావరాదె!.” అంటున్న ప్రభ మాటలు వినబడుతున్నాయి.
బలవంతముగా
నన్ను లేపి వాష్ రూమ్ లోని షవర్ కింద కూర్చోబెట్టి షవర్ ఆన్ చేసింది.
చిన్నగా
మొదలైన నీటి చినుకులు మేనంతా వ్యాపించి ముద్దు ముద్దు గా ముద్దుల పులకింతలతో ముంచేస్తూ, ఆణువణువూను అభిషేకిస్తున్న అమృత ధార.
అవును మరి, జలం… సుజలమై, శిరస్సు నుండి పాదం వరకు నన్ను స్పృశిస్తూ....అణువణువును ఊరడిస్తూ...అంతర్లీనంగా దాగిన, అహంకారాన్ని
కడిగేస్తూ… మూల మూలల్లో దాగిన, మూర్కత్త్వాన్ని తుడిచేస్తూ…. నా గుండెల్లో దాగిన భాదను తగ్గిస్తూ....కణకణములో దాగిన నిప్పు కణికెల్ని ఏరిపారేస్తూ....తండ్రిలా లాలిస్తూ ...అమ్మలా అక్కున చేర్చుకుని మేనంతా నిమురుతుంటే అబ్బా! యెంత హాయిగా వుంది.
శ్రీ వచ్చి నాకు అన్ని సపర్యలు చేస్తున్నట్లుంది. ఎటు పోవద్దనట్లు
శ్రీ ని గట్టిగ కౌగిలించుకున్నాను. ఆ కౌగిలి పట్టుతప్పి నేల పై జారిపడ్డాను. నుదురు పై దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు మగత నుండి మెలుకువ స్థితి కి వచ్చాను.
కిందపడ్డ నేను "శ్రీ" అంటూ గట్టిగ అరిచాను. వెంటనే ప్రభ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందే అంటూ తను అడుగుతుంటే, “కిందపడ్డాను” అంటూ బదులిచ్చాను. అది నన్ను తిడుతూనే నా ఒంటిమీద వున్నా బట్టలు మార్చింది.
" ఏమైందే నీకు ... ఎందుకిలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు.. ఎప్పుడు లేనిదీ ఈ తాగుడు ఏంది. అసలు ఏమైందే నీకు దెయ్యం ఏమైనా పట్టిందా!"
అంటూ మెత్త మెత్తగా చివాట్లు పెడుతుంటే నా కళ్ళనుండి నీళ్లు జలజలా రాలుతుంటే "ఊరుకోవే! మంచిగా ఉన్నోడిని చుస్తే, మొత్తబుద్దావుతాదంట ఆలా వుంది నీ వ్యవహారం చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావు. అంటూనే తడిచిన నా తలని తుడుస్తోంది
జీవితాన్ని ఉన్నంతలో ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి అంతే కానీ లేనిపోని మాటలతో ....నోటికేదొస్తే అది మాట్లాడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ….ఈ తలనొప్పులేందే, శ్రీ కాబట్టి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ....వెళ్ళడు కూడా ఎందుకంటే నువంటే అంత ఇష్టం.”
అంటూ నా తలని పక్కకి త్రిప్పింది. అక్కడ “శ్రీ” నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను కళ్ళు నులుముకున్నాను ...నా చేతిని నేనే గిల్లుకున్నాను. ఇంకా నమ్మకం లేక ప్రభ చేతిని గిల్లాను. ప్రభ “ఒసేయ్” అంటూ గట్టిగా అరిచింది. అప్పుడు నాకు నమ్మకం కలిగి, ప్రభ ఉందన్న ధ్యాస కూడా లేకుండా…..అపురూపమైన వస్తువు దొరికినంత సంబరంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అతని గుండెలపై కొడుతూ గట్టిగా వాటేసుకున్నాను
నన్ను వదిలి ఎక్కడికి పోయావు అని నేనడుగుతుంటే నవ్వుతున్నాడు.
వెనుకనుండి ప్రభ ఈ డైరెక్షన్ నాదే నీకు తెలిసిరావాలని మా ఇంట్లో వుంచాను. అని చెపుతుంటే ఒసే నీ దుంపతెగా! అంటూ కొట్టడానికి చేయెత్తాను. మా ఇద్దరిని వెనుకనుండి
గమనిస్తున్న శ్రీ ఒకటే నవ్వు
దేవి : ఎందుకు నవ్వుతున్నావు
శ్రీ : ఇప్పుడైనా
తెలిసిందా
దేవి : ఏమిటి
శ్రీ : ప్రేమ వేరని ... కోరిక వేరని
దేవి: అంటే
ఇదంతా నాకు తెలియాలనే చేశారా
శ్రీ : ఒప్పుకుంటావా లేదా! నేను కరెక్టని
శ్రీ నే
కరెక్ట్ అన్నట్లు అతన్ని మరింత గట్టిగా వాటేసుకున్నాను.
హలో ఇక్కడ
నేనున్నాను.నన్ను పట్టించుకోండి. మీరు తరవాత ఒకర్నొఒకరు గట్టిగా కౌగలించుకోండి. అంటూ
ఆ మూలాన కారియర్ లో పంచ భక్ష్య పరమాన్నాలు వున్నాయి. వాటిని ఇద్దరు కలిసి కాళీ చేయండి.
నేను రేపు ఆఫీస్ లో కలుస్తాను. అని అంటుంటే “థాంక్స్ ప్రభ” అని నేనంటూంటే “ఇప్పుడు
థాంక్స్ చెపుతావు తల్లి, తరువాత తిడతావు వద్దు తల్లి నువ్వొద్దు… నీ దోస్థానం వద్దు.”
అని ప్రభ అంటుంటే నేను తిరిగి “క్షమించమంటూ” చేతులు పట్టుకున్నాను. “సరెలేవే మనం …మనం
ఫ్రెండ్స్ సరేనా! ఫస్ట్ శ్రీ ఆకలి చూడు,” అంటూ
కన్ను కొడుతూ బయటికి వెళ్ళింది. ప్రభ బయటికి వెళ్లిన తరువాత ఇద్దరం కలిసి ఒకరికొకరం
తిన్పించుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశాం.
అలానే ఇద్దరం
ఇంట్లోని బాల్కనీ లోకి వెళ్ళాము.
అది వసంతమాసం….. అందునా వెన్నెల కాలం. ఒకరి కళ్ళల్లో ఒకళ్ళం చూసుకుంటూ
ఆనందామృతాన్ని గ్రోలుతూ…. నాలోని అందం మకరంధమై తనని కవ్విస్తుంటే …. అతని చూపులు ఎక్కడెక్కడో గుచ్చుకుని నా హృదిలో దాగిన
పులకరింతల సిగ్గుల మొగ్గలు...పూలై పరిమళిస్తుంటే …ఆ పూల సుగంధాన్ని ఆస్వాదిస్తూ తను
....తన ఆస్వాదనలో నన్ను నేను మైమరుస్తూంటే.... నా అందాల తెరలు ఒక్కోకోటి తీస్తూ తను
… నన్ను వివశురాలిని చేస్తుంటే ....… తప్పటడుగులు వేస్తూ నేను.
నన్ను…. నేను తమాయించుకోలేక ... నే ... సోలిపోతుంటే …. తను ముద్దుల తోరణాలు చుట్టి…..కౌగిలి వాకిట్లో… స్వాగత చందనాలతో, పరమానందమనే సుమగంధాన్ని రంగరించి…. గుసగుసల గుబాళింపులతో నన్ను గుండెల్లో దాచుకుంటూ..వెన్నెలకె అసూయా కలిగేలా ప్రకృతి లో కరిగిపోతూ....కలిసిపోయిన మమ్మల్ని చూసిన జాబిలికి సిగ్గేసి మబ్బుల చాటుకు తప్పుకుంటుంటే..మా ఇద్దరి నయనాలు నక్షత్రాలై మెరిసిపోతున్నాయి.
Comments
Post a Comment