Oh My sweet Darling

 ఓహో మై స్వీట్ డార్లింగ్

                            

                                             భానుచందర

ఎన్నెన్నో ఊసులను సప్తవర్ణాలతో రంగరించి, నన్ను ఉక్కరిబిక్కిరి చేసిన ప్రియాతి ప్రియతమా!…

                                         


        

వెన్నెల్లో చేరి శతకోటి దీపాలతో నీకు స్వాగతమంటూ...భిన్న శోభిత కుసుమాలతో నిన్నలంకరిస్తూ.. పరిమళభరితమైన పదామృతాలతో నిన్నభిషేకించినా ప్రియుడ్ని….తనువులోని ఊపిరాగిపోయి-నప్పుడు తప్పితే నిన్నెలా మరువగలను ప్రియతమా! అని బరువుగా..ముద్ధుగా జవాబు ఇస్తావని తెలుసు.

                                            

You are so great beauty.

 

గల గల పారే  సెలయేరులా పరవళ్లు తొక్కే నువ్వు మౌనాన్ని ఆశ్రయించావేంటి?

 

ఓహో! నేనిన్ని రోజులు ఎక్కడున్నానో...ఏం చేస్తున్నానో.. చెప్పకుండా.. అదృశ్యమై, నీ మనసుని కష్టపెట్టినందుకా!

 

ఇదుగో, నువ్వు మౌనాన్ని ఆశ్రయిస్తే, నీ సొగసైన కంఠంపై బంగారు హారాన్నై…ముద్దులతో గిలిగింతలు పెడుతూ...పచ్చని కొండల్లో చేరి, వెచ్చని ఊసులతో, సరసాన్నీ మిక్స్ చేసి, సరిగమ సరసమా! సరిగమ సంగీతరసమా! సరిగమ పారవశ్యమా! అంటూ పాట పాడవలసివస్తుంది.

                                    



 అదుగో ఆలా నువలా నవ్వుతుంటే ఆహా!  ఏం అందం..ఎంత ఆనందం. ఈ అందాల ఆనందములో  జనించిన నవ్వుల  సుగంధాన్నీ గుండెలో దాచుకొని ఆఘ్రాణించాలనిపిస్తుంది.

 

అరే.. రే..రే  ఈ లేఖ చదివే నీలో ఎన్ని మార్పులు...మరెన్ని మైమరపులు.

                                            

లెటర్ రాక ..రాక వచ్చిందనే, పారవశ్యం ఒకవైపు ...లెటర్ ని తొందరగా చదవలానే ఆరాటం మరో వైపు, ప్రియా! ఈ పారవశ్యపు పోరాటంలో నీ ఆణువణువూ చందనాల పరిమళం వెదజల్లుతుంది.

                                          


 
నీ కన్నుల నిండా నీళ్లేమిటి? గుండెలో ఉబికిన సంతోషసాగరమా! లేక హృదిలో పొంగిన ఆనంద కెరటమా! 
అయినా జన్మతః స్త్రీకి కన్నీటికి విడదీయరాని బంధముంది. ఆనందమొచ్చిన ..విషాధమొచ్చిన స్త్రీని కన్నీరు పరామర్శిస్తుంది. 
ఈ కన్నీరే తన ప్రియ మిత్రుడని తలచి జీవింతాంతం తోడుంచుకొంటారు.

 

మనసులో భావాన్ని ఇంత చక్కగా చెప్పే నువంటే నాకెంతో ఇష్టమంటూ పొంగిపోతున్నావా! 

మరి అంత ఘనం పొంగకు. ఎందుకంటే, పొంగిందల్లా నేలపాలవ్వాల్సిందే.


నీలాంటి ప్రియురాళ్లు ఎంతోమంది...అందులో నువొక దానివి. 

వాళ్లందరికీ నీకు చెప్పిన మాటలే చెప్పి లోబరుచుకున్నాను ...ప్రేమ మంత్రముతో వాడుకున్నాను.

                                


ఏమిటి గుండె కొట్టుకోtవడం ఆగిపోయిందా!….ఆటలు పట్టిస్తున్నాడని అపోహ పడుతున్నావా! 

అబద్ధాలు చెప్తున్నాడని అమాయకంగా ఆలోచిస్తున్నావా! లెక్క తప్పిందని దిగులు పడుతున్నావా!.

 

ఆడదాని అమాయకత్వమన్నా...జాలితనమన్నా చిన్నప్పటినుండి తెలియని కసి. ఆడదాని అమాయకత్వం వల్లనే నేను పుట్టాను.

ఆడదాని అమాయకత్వం వల్లనే సమాజానికి లోకువై పోయాను.  

అదుగో, అలాంటి అమాయకత్వం అడ్రస్ లేకుండా చేద్దామనే ఉద్దేశ్యముతో ..మిమ్మల్ని అదే అమాయకులైన అమ్మాయిలందరిని మాయ మాటలతో ఏమార్చాను. 

నీ పరం గా చెప్పాలంటే ఘోరాతి ఘోరముగా అన్యాయం చేశాను.

                                        


అందమైన అమాయకపు పిల్ల కనపడితే చాలు.

"ప్రేయసి నువ్వే నా ఊర్వశి..నువ్వు లేకుంటే ఈ ప్రపంచమే లేదు. నువొక క్షణం కనపడకపోతే నాకిక  మరణమే  శరణమంటూ"  ఎన్ని  వేషాలు  వేశానో... 

మీ అందాల విందు కొరకై ఎన్ని మోసాలు చేశానౌ... 

నా వేషాలు చూసి ఆవేశపడి అందాలన్నీ సమర్పించుకున్న మిమ్మల్ని తలచుకుంటుంటే బలే నవ్వొస్తుందిలే.

                                            
    
                 

స్కౌండ్రల్ అని తిడుతున్నావా! లేక కత్తికో కండగా నరికేద్దామని ఆవేశపడ్తున్నావా! హలో ఒకసారి ఆవేశపడి మోసపోయావు...

నీకెందుకీ ఆవేశం చెప్పు...అయినా, ఆడవారికి దయ..జాలీ పుట్టుకతో సంక్రమిచ్చిన ఆస్తులు. కాబట్టి నన్ను చంపెద్ధామని ఆవేశమొచ్చిన...నీలోని అదేనోయ్ దయ ..జాలీ నన్నేమి చేయనీయవు.

                            


  
Oh my sweet Darling...నా ఫ్రెండ్స్ సర్కిల్ లో నా కున్న అందమైన పేరేమిటో తెలుసా! 
“Father of Love”  Yes ...నేను వల్లించిన ప్రణయ కావ్యాలు ...నేను వర్ణించిన ప్రేమ దృశ్యాలు బహుశా ఏ కవి రాసి ఉండడు...ఏ చిత్రకారుడు గీసి ఉండడు. అందుకే..అందుకే  నాకీ పేరొచ్చింది.

 

నన్ను గుండెల్లో దాచి గుడిలో దేవుడిలా పూజించి...నన్నే సర్వస్వముగా భావించినా మీరందరు కని….పెంచి ప్రేమాభిమానాలను పంచిన తల్లితండ్రులను కూడా నన్ను ప్రేమించినట్లు……సారీ, ప్రేమానుకూడదేమో, నన్నభిమానించినట్లు  కన్నవాళ్ళని కూడా అభిమానించలేదేమో!

                                                    


 
ప్రియా!

 ఏమిటి? ఒళ్ళంతా తేళ్లు..జెర్రులు పాకినంత వికారంగా ఉందా! 

ఒకప్పుడీ మాటలే మేనంతా పరవశాల మత్తు జల్లి...నేడీ మాటలే శరీరాన్ని సూదులతో గుచ్చినంత భాధ కలగటానికి కారణం అర్థమైందనుకుంటాను.

ఏమిటలా తెల్ల మొహం వేసుకు చూస్తున్నావు...అదుగో ఆ….. మోమే నిన్ని స్థితికి తీసుకొచ్చింది.

 

నిన్ను …నీలోని,  ఆశలను..కళలను సర్వనాశనం చేశానని విలపిస్తున్నావా! నువ్వక్కడ విలపిస్తుంటే నాకిక్కడ నిషా కలుగుతుంది. 

బహుశా ఏ హెరాయిన్..ఏ  కాక్టైల్ తీసుకున్న ఇంత నిషా రాదేమో!

ఏమిటి? అప్పుడే ఏడుపు ఆపేశావు. నువ్వు ఏడవాలి... గుండెలు పగిలేలా... ఏడవటానికి  కూడా శక్తి లేనంతగా…అప్పుడే ...అప్పుడే నాకు మనశాంతి.

                                                                                        
    
                                    

               

ని కళ్లేమిటి ఇంత ఎర్రగా తయారైయ్యాయి...ఎందుకైతే నాకేంటి కానీ..వాటిని చూస్తుంటే నాలో మల్లి కోరిక కలుగుతుంది. 

ఏయ్!..ఏంటి? గట్టిగ కళ్ళు మూసుకుంటున్నావేంది?. భాధగా ఉందా! నాకు బాధగానే ఉంది ఏం చెయ్యను చెప్పు…అనవసరముగా నిన్నొదిలేశాననే దిగులు కూడా నన్ను వేధిస్తుంది. ఏం చెయ్యను చెప్పు?...నాలోని నిజాయితీ నా గురించి చెప్పేవరకు నన్ను నిద్రపోనివ్వలేదు.

 

చండాలుడా… అంటూ బి పీ  పెంచుకోకు. ఎందుకంటే, ఆరోగ్యమే మహాభాగ్యం.

 

ఏ అమ్మాయి అయినా నేను చేసిన పనికి బాధపడకుండా టేక్ ఇట్ ఈజీ గా తీసుకున్న క్షణం...నాగుండె బగ్గు భగ్గున మండేది. 

అలాంటి సమయాన్నే నీలాంటి అందమైన...అమాయకమైన లేడీని, వెతికి..వెతికి…వేటాడి ఆటాడుకునేవాడిని. 

ఆమె హృదయాన్ని కరిగించి మరిగించి ఆరగించేవాడిని. నలుగురు దూషించేలా…అందరూ చీ..కొట్టేలా ఆమె మానాభిమానాల్ని మంటగలిపేవాడిని. ఆ విధముగా మీ అమాయకత్వం నాశనం చేసే నేను చాలా మంచివాడ్నని ...సంఘసంస్కర్త అని అనుకుంటున్నాను.

 

చి..చి పశువుకు నీకు పెద్ద తేడా లేదని తిడుతున్నావా!

 

మరి అంతగా నోరు పారేసుకోకు .. ఎందుకంటే కొద్ది క్షణాల ముందువరకు,

ఈ పశువే  నీ తనువూ

ఈ పశువే  నీ మనసు

ఈ పశువే  నీ లోకం

ప్రాణాలు వేరైనా ఈ పశువు ఆత్మ...నీ ఆత్మ ఒకటే! టోటల్ గా, ఈ పశువే నీ పంచప్రాణాలు. అలాంటి పశువును తీసిపారేస్తే ఎలా! చెప్పమ్మా..చెప్పు! 

తప్పుగా మాట్లాడకూడదు. వెనుకాముందు ఆలోచించుకొని మాట్లాడాలి.

ఏయ్ చిలిపి ముక్కులెగరేస్తున్నవేంది?

                                                              

నేను చెప్తున్నదానికా! సముద్రంపైని అలల్లాగా ముక్కు ఎగిసెగిసి పడుతుంటే, సుతారంగా కొరకాలన్పిస్తోంది..సున్నితముగా ముద్దెట్టుకోవాలన్పిస్తుంది. 

ఏంటి? మొహన్నీ ఆలా తిప్పేసుకుంటున్నావు. నాకు నచ్చని విషయం అదే...ఇంతకు ముందే చెప్పినట్లున్నాను.

 

నన్ను శిక్షిస్తావా! ఎవరికి అన్యాయం జరుగకుండా నాకథ చెప్పి నన్ను కడతేరుస్తావా! అబ్బో పెద్ద..పెద్ద మాటలు చెప్తున్నావె. 

ఇంత చక్కటి చుక్కకి, అంత పెద్ద కోరికలు పనికిరావు. ఎందుకంటే అలనాటి సీతే అందరి మాటలు భరించలేక అగ్నిలో దూకింది. ఇంకా నువెంత చెప్పు?

 

అయినా ఒక విషయం చెప్పనా! నువరచి అల్లరి చేస్తే అందర్లో చులకనైపోతావు...ఐమీన్, ఈ సమాజానికి లోకువైపోతావు...ఎందుకో తెలుసా! 

నీ కద తెల్సిన ప్రతి ఒక్కరు తమకి అవకాశం వస్తుందేమోనని ఆశ పడుతుంటారు.

 

ఎందుకంటే నువ్విప్పుడు ఆకాశములోని చుక్కవి కాదు...అవనిలో దాగిన రత్నానివి కాదు.

అర్థమైందనుకుంటాను.

 

పేరు

అనవసరమనుకుంటాను.

 

*****THE END*****


Comments

Popular posts from this blog

Sridevi

My Love Story